featured-image

ప్రస్తుతం మనం సోషల్ మీడియా జమానాలో బతుకుతున్నాం. మనం ఏం పని చేసినా సరే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. లేదంటే దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కాగా రీసెంట్‌గా ఊర్వశీ రౌటేలా అలాంటి పరిస్థితి ఎదుర్కుంది ఈ బ్యూటీ ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేసింది. అందులో ఈ బ్యూటీ బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లి..



అక్కడ డ్రెస్ విప్పుతున్న దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఇలా ఒక్కసారిగా ఊర్వశీ రౌటేలా వీడియో నెట్టింట ప్రత్యక్షమవడంతో బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఒక్క సారిగా షాక్‌లోకి వెళ్లింది. అయితే ఇది సినిమాలోని సీన్ అని అప్పుడు క్లారిటీ వచ్చేసింది.

కాగా తాజాగా దీనిపై ఊర్వశీ రౌటేలా స్పందించింది. అది నిజమైన వీడియో కాదు. నేను యాక్ట్ చేస్తున్న గుస్పేటియా అనే కొత్త సినిమాలో సీన్.

కానీ ఇలా రిలీజ్‌కు ముందే ఇలాంటి లీకులు రావడం, అది వైరల్ కావడం తనను చాలా బాధ కలిగించిందని చెప్పింది. ఇలాంటి చేదు అనుభవం ఏ అమ్మాయికి ఎదురుకాకుడది ఆవేదన వ్యక్తి చేసింది. ఇక మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ దశాబ్దం కిందట వచ్చిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అవడంతో ఈ బ్యూటీ పేరు పెద్దగా వినిపించలేదు. ఆయితే ఆ తర్వాత ఏడాది యో యో హనీసింగ్ తో కలిసి ‘లవ్ డోస్’ అనే ప్రైవేట్ ఆల్భమ్ లో కనిపించింది. ఈ సాంగ్ తో ఊర్వశికి హిందీనాట ఫుల్ పాపులారిటీ వచ్చేసింది.

ఆ తర్వాత మికా సింగ్ తో ‘లాల్ దుపట్టా’, హనీ సింగ్ తో ‘గల్ బన్ గయి’, టోనీ కక్కర్ తో ‘బిజిలీ కీ తార్’, మీట్ బ్రోస్ తో ‘ఏక్ డైమెండ్ దా హర్’ ఇలా బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్ వీడియోలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. బాస్‌ పార్టీ అంటూ ‘వాల్తేరు వీరయ్య’లో వయ్యారాలు ఒలికించిన ఊర్వశి ఈ భామనే. పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాలో మై డియర్ మార్కాండేయ అంటూ యూత్ ను మత్తులో ముంచిన భామ కూడా ఆమెనే.

ఇక ఊర్వశి ఇప్పుడు ఐటెం గర్ల్ లా మారిపోయింది. ఏదైనా స్టార్ సినిమా వస్తుందంటే చాలు..

ఊర్వశితో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ గతేడాది ఏకంగా తెలుగులోనే నాలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది. ఆ మధ్య ఈ బ్యూటీ తన 30 పుట్టిన రోజును అంగరంగ వైభవంగా జరుపుకుంది.

24 క్యారెట్ల బంగారు పూతతో చేసిన కేక్ ను ఈ బ్యూటీ కట్ చేసింది. ఊర్వశి పుట్టిన రోజు సందర్భంగా ఆ బంగారపు కేకును బాలీవుడ్ ర్యాపర్ హనీసింగ్ తెప్పించాడు..

Back to Entertainment Page